అలా ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలో నటించినంత మాత్రాన ఎవరు ఏది రాస్తే అది ఒప్పుకోవాల్సిందేనా? అనవసరంగా లేనిపోనివి అన్నీ రాసి ఇబ్బందిపెడుతున్నారంటూ మీడియాపై చిందులేస్తోంది అందాల నటి శిల్పాశెట్టి. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఆమె అవకాశాలకోసం వెంపర్లాడుతోంది. తెలిసిన వాళ్లను కలిసి అవకాశాలు ఇమ్మని అడుగుతోందట. దాంతో బాలీవుడ్ మీడియా శిల్పాశెట్టి తన భర్తకు దూరమైందని, అందుకే సినిమాలలో నటించడానికి భారీ ప్రయత్నాలు చేస్తోందని కథనాలు రాశారట. దీంతో రెచ్చిపోయిన శిల్పాశెట్టి అలా ఎందుకు రాస్తారు? అంటూ అడుగుతోంది. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తున్నాను కానీ, తమ వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడుదుడుకులు లేవని చెబుతోంది. అయితే వారిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారని మరో కథనాలు కూడా వినిపించాయి. దీనిపై నోరు మెదపడంలేదు శిల్పాశెట్టి. దీని భావమేంటో త్వరలో తెలుస్తుంది!