కథ నచ్చితే ఏ భాషలోనైనా ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటుపై హీరోయిన్‌గా తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. తాజాగా తెలుగు తెరకు పరిచయమై నటించిన చిత్రం ‘జంటిల్‌మన్’. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, సురభి హీరోయిన్లుగా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ ఇంటర్వ్యూ...
రెస్పాన్స్ ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది. సినిమా విడుదలకు ముందే మంచి నమ్మకం ఉండేది. అది రిలీజ్ తరువాత బాగా పెరిగింది. ముఖ్యంగా నా పాత్రకు మంచి స్పందన రావడం ఆనందంగా వుంది.

ఈ అవకాశం ఎలా వచ్చింది?
- కోడైరెక్టర్ సురేష్ నేను నటించిన కొన్ని సినిమాలు చూశారు. దాంతో నా గురించి దర్శకుడికి చెప్పారు. ఆయన నన్ను పిలిపించి ఈ కథ చెప్పాడు. కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యా. ముఖ్యంగా నా పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది.
నానితో పనిచేయడం?
- నిజంగా నానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తను నటించిన సినిమాలన్నీ చూశాను. పర్సనల్‌గా మాత్రం ఈ సినిమాతోనే పరిచయం. చాలా అద్భుతంగా నటిస్తాడు. కమల్‌హాసన్ తరువాత అంత సహజంగా నటించింది నానినే. ముఖ్యంగా తోటి నటీనటులను అభినందించడానికి చాలా గట్స్ కావాలి. అవి నానిలో వున్నాయి.
ఇద్దరు హీరోయిన్లతో ప్రాబ్లెం కాలేదా?
- కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు అవసరం. ఎవరి పాత్ర వారిదే. ముఖ్యంగా సురభితో పనిచేయడం చా లా ఆనందంగా అనిపించింది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. షూటింగ్‌లో బాగా అల్లరి చేసేవాళ్లం.
దర్శకుడు మోహన్‌కృష్ణ గురించి?
- ఈ కథను ఇంత బాగా డీల్ చేసినందుకు మోహన్‌కృష్ణను అభినందించాల్సిందే. ముఖ్యంగా సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. నేను ఇప్పటివరకూ ఇలాంటి దర్శకుణ్ణి చూడలేదు.
తెలుగులోనే సెటిల్ అవుతారా?
- కథ నచ్చితే ఏ భాషలోనైనా సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. దక్షిణాదిలో వున్న భాషల్లో కన్నడ తప్ప అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ప్రత్యేకంగా తెలుగులోనే సెటిల్ అవుతానని చెప్పను.
గ్లామర్ పాత్రలు చేస్తారా?
- నాకు స్కిన్ షో నచ్చదు. ముందు కథ విన్న తరువాత ఆ పాత్రకు నేను సూట్ అవుతానా లేదా అనేది ముందు చూసుకున్న తరువాత దర్శకుడు ఎవరు, హీరో ఎవరు అనేదాన్ని బట్టి ఆ సినిమా చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాను. పాత్ర పరిధివరకూ గ్లామర్‌గా వుంటే ఓకె.
తెలుగులో అవకాశాలు వచ్చాయా?
- ఈ సినిమాకు ముందు అవకాశాలు వచ్చాయి కానీ కథ నచ్చక చేయలేదు. అలాగే అల్లరి నరేష్‌తో కలిసి తమిళ సినిమా చేశాను. తను కూడా చాలా ఫ్రెండ్లీగా వుంటాడు.
తదుపరి చిత్రాలు
- ఇప్పటివరకూ ఏ సినిమా ఓకే చేయలేదు. అలాగే తమిళ, మలయాళంలో కూడా ఏ సినిమాకు సైన్ చేయలేదు.

-శ్రీ