ఫాలో ఫాలో యూ ట్రైలర్ లాంచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై ఎమ్.డి.నజీమ్ దర్శకత్వంలో నవీద్‌ఖాన్, శిరీషా, ఛాహత్, రిమా ప్రధాన పాత్రల్లో టీమ్‌వర్క్ మూవీ మేకర్స్‌వారి అలీ నిర్మిస్తున్న చిత్రం ‘ఫాలో ఫాలో యూ’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు ట్రైలర్ ఆవిష్కరణ ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నటుడు ఖయ్యూం, సాయివెంకట్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. దర్శకుడు ఎమ్.డి.నజీమ్ మాట్లాడుతూ... ‘దర్శకుడుగా నాకిది తొలి చిత్రం. ఇదొక హర్రర్ బేస్డ్ లవ్ స్టోరీ. అప్పుడే పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితంలోకి ఒక సైకో లాంటి అమ్మాయి ఎంటరై వారి జీవితంతో ఎలా ఆడుకుందనేది చిత్ర ప్రధానాంశంగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నవీద్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. ప్రతి సన్నివేశం క్యూరియాసిటీ కలిగించేలా ఉంటుంది. ఆడియన్స్‌కి కావల్సిన ఆల్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందించాము. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలైలో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. నిర్మాత అలీ మాట్లాడుతూ.. ‘సినిమా మీద ఉన్న ఇష్టంతో పలు వ్యాపారాలు చేసే నేను తొలిసారిగా సినిమా పరిశ్రమలోకి ఎంటరై ‘ ఫాలో ఫాలో యూ’ సినిమా నిర్మిస్తున్నా. నా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. హీరో నవీద్‌ఖాన్ మాట్లాడుతూ తనకిది తొలి సినిమా అని అన్నారు.