పవన్ చిత్రానికి మారిన దర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ తాజాగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి మొదట తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు. కానీ సూర్య బిజీగా ఉండడంతో ఆ చిత్రానికి దర్శకుడు మారాడు. ‘గోపాల గోపాల’
చిత్రంతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న డా లీ ఈ చిత్రానికి దర్శకత్వం
వహించనున్నాడు. ఎస్. జె.సూర్య ‘ఇరైవి’ చిత్రం హిట్టవ్వడంతో అటు నటుడిగా ఇటు దర్శకుడిగా బిజీగా మారిపోవడంతో తెలుగు చిత్రానికి మార్పు తప్పనిసరైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. శరత్‌మరార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఓ ఫ్యాక్షన్ నాయకుడి కథతో రూపొందించనున్నారు.