24న జక్కన్న ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సునీల్ నటించిన ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హీరోకు అన్ని రకాల షేడ్స్ ఉన్నాయని, సునీల్ కామెడీ టైమింగ్‌కు థియేటర్లలో చప్పట్లు పడడం ఖాయమని అన్నారు. టైటిల్ సాంగ్ హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో దర్శకుడు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారని, ఆడియోను ఈనెల 24న విడుదల చేసి సినిమాను జూలైలో ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కబీర్‌సింగ్, సప్తగిరి, పృధ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, రఘు, సత్యప్రకాష్, రాజా రవీంద్ర, ఆనంద్‌రాజ్, ఉదయ్, సత్య, వేణుగోపాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సి.రాంప్రసాద్, సంగీతం:దినేష్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, మాటలు:్భవానీ ప్రసాద్, నిర్మాత:ఆర్.సుదర్శన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ల.