దెయ్యం పాత్రలో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న రెజీనా, ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ పాత్రలనే మెప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆమె తన కొత్త సినిమాలో ఓ సరికొత్త పాత్రలో, తన శైలికి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కే రొమాంటిక్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటించనున్న రెజీనా, ఆ సినిమాలో ఓ దెయ్యంగా కనిపించనున్నారట. ఇందుకోసం ఇప్పటికే రెజీనా లుక్ టెస్ట్ కూడా పూర్తిచేశారట. త్వరలోనే రెజీనా పార్ట్‌కు సంబంధించిన షూట్ మొదలవుతుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, నందిత శే్వత ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొద్దికాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను గౌతమ్ మీనన్, సెల్వరాఘవన్ సౌతిండియాలో ఓ కొత్త ప్రయోగంగా ప్రచారం చేస్తున్నారు. హారర్ సినిమాతో రెజీనా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి?

చిత్రం రెజీనా