1న రోజులు మారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్, మారుతి టాకీస్, గుడ్ సినిమా పతాకాలపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రానికి మారుతి, కథ, స్క్రీన్‌ప్లే అందించారని, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాకన్నా ముందే చేద్దామనుకున్నారని, అయితే తనకు ఈ కథను ఇచ్చి దర్శకుడిగా చేశారని అన్నారు. దర్శక నిర్మాతలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని, ఈ సినిమా విజయవంతం అవుతుందని కథానాయకుడు చేతన్ అన్నారు. ఒక వ్యాసం నుండి ఈ కథ పుట్టిందని, దాన్ని రవి, మురళి చాలా త్వరగా మంచి స్క్రిప్టుగా తయారుచేశారని, ఎలా కథను రాసుకున్నామో అలానే తెరకెక్కించామని దర్శకుడు మారుతి అన్నారు. ఈ సినిమా ఎలా వస్తుందో అన్న ఆదుర్దా మొదట్లో వుండేదని, కాని ఇప్పుడు తొలి కాపీ చూశాక అందరి సహకారంతో ఈ చిత్రం చక్కగా రూపొందిందని అన్నారు.