మురుగదాస్ అఖీరా ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపులర్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘అఖీరా’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. బాలీవుడ్‌లో ‘గజినీ’, ‘హాలిడే’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్, అక్కడ తన మూడో ప్రయత్నంగా ‘అఖీరా’ అనే సినిమాను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మురుగదాస్, మరో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీమ్, అఖీరా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో మురుగదాస్ చూపిన కొత్తదనం నెటిజన్లను బాగా ఆకర్షించింది. ఇక మహేష్-మురుగదాస్ సినిమా జూలై మూడో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.