ఆవు పులి... ప్రభాస్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.బి.చైతన్య దర్శకత్వంలో రవి పంచపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఎ.రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకులు చైతన్య మాట్లాడుతూ, ఈ పేరు వినగానే అందరూ కాంట్రొవర్షియల్ టైటిల్ అనుకున్నారని, సినిమా చూశాక పాజిటివ్‌గా ఫీల్ అవుతారని, చక్కటి ప్రేమకథతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. ఓ నిజమైన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో టీజర్‌ను ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అశ్విని చంద్రశేఖర్ కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాకర్, భానుశ్రీ, జబర్దస్త్ వేణు, అప్పారావు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎం.టి.రవిశంకర్, కమెరా:అర్లీ, నిర్మాత:రవి పంచపాల, రచన, దర్శకత్వం:ఎస్.జె.చైతన్య.