రేపటినుంచి కత్తిలాంటోడు షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ మరో రెండు రోజుల్లో స్టార్ట్ అవుతోంది. జూన్ 23 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ చిరంజీవి మీదే తీస్తున్నారట. ఈ సినమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ వేశారు. అందులో ఫస్ట్ డే షూటింగ్, నెక్స్ట్‌డే 24న హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌మీద ప్లాన్ చేశారని తెలిసింది. ఆర్టిస్టుల డేట్స్‌ను బట్టి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘్ఠగూర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాని మెగా అభిమానులకు అందించిన వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల మాటీవీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి వేసిన స్టెప్పులు చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరు రీ ఎంట్రీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.