రాజవౌళి బాగోలేదంటే ఆ కథ వదిలేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత తెలుగు సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వరా ముళ్లపూడి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రచయితగా, దర్శకుడిగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో ‘నా అల్లుడు’, ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వరా, తాజాగా ‘కుందనపుబొమ్మ’ సినిమాతో ముందుకు వస్తున్నారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వరా ముళ్లపూడి చెప్పిన విశేషాలు..
గ్యాప్ అందుకే వచ్చింది..
వెంట వెంటనే సినిమాలు చేయకపోవడానికి కారణం నన్ను ఎగ్జైట్ చేసే అవకాశాలు రాకపోవడమే! ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ తర్వాత యాడ్ ఫిల్మ్స్, సీరియల్స్‌తో బిజీ అయిపోయా. ఈ గ్యాప్‌లో వచ్చిన అవకాశాలన్నీ నచ్చక చేయలేదు. ఈ ‘కుందనపుబొమ్మ’ కథ మాత్రం నన్ను మళ్లీ సినిమా దర్శకత్వం వైపు మళ్లించింది.
తెలుగుదనం ఉట్టిపడేలా..
‘కుందనపుబొమ్మ’ తెలుగుదనం ఉట్టిపడే ప్రేమకథ. అందరికీ నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఎక్కువగా బొబ్బిలి, విజయనగరంలో షూట్ చేశాం. సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక నేను ఈ కథ అనుకున్నప్పుడే అచ్చ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని అనుకున్నా. చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూసినప్పుడు ఈ అమ్మాయి అయితే సినిమాకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నా. అందుకు తగ్గట్టే మా కథకు చాందిని మంచి స్థాయి తెచ్చింది.
రాజవౌళికి కథలు చెబుతా..
వీలున్నంతవరకూ నా ప్రతీ కథా రాజవౌళికి చెబుతుంటా. రాఘవేంద్రరావుగారి దగ్గర పనిచేసేప్పటినుంచే రాజవౌళి బాగా తెలుసు. అతడి జడ్జిమెంట్ పర్‌ఫెక్ట్‌గా వుంటుంది. ఓ కథ బాలేదని రాజవౌళి నోటినుంచి వచ్చిందంటే, వెంటనే ఆ కథను పక్కన పెట్టేస్తా.
తదుపరి ప్రాజెక్టులు
రమణగారు - బాపుగారు కలిసి రాసిన ఓ మంచి కథ ఉంది. దాన్ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చి ఓ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నా. ఇంకా చాలా కథలే రాసి పెట్టుకున్నా. ఈ సినిమా విడుదలయ్యాకే తర్వాత ఏంటనేది ప్రకటిస్తా.

- శ్రీ