పాటల్లో ఇద్దరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్, సాయికృప జంటగా సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో జవాన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిన ‘ఇద్దరం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నవదీప్, శివదీప్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘సంజీవ్‌తో నాకు ముందే పరిచయం వుంది. ఈ సినిమా ప్రోమో చూపించారు. చాలా ఆసక్తిగా వుంది. బాగా తీశారు. మంచి ఫీల్ వున్న ఈ సినిమాతో యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి’ అన్నారు. దర్శకుడు సుధాకర్ మాట్లాడుతూ, ‘ఇదొక సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ప్రతిరోజూ న్యూస్‌పేపర్‌లో గ్యాంగ్‌రేప్‌లు జరుగుతున్నాయని చదువుతుంటాం. అలాంటి గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళలో ఓ మంచి వ్యక్తి వుంటే ఏమవుతుంది అనే కానె్సప్ట్‌తో ఈ తెరకెక్కిన సినిమా ఇది. వైజాగ్, మచిలీపట్నం, బీదర్‌లలో చిత్రీకరించారు. జూలై 1న చిత్రాన్ని విడుదల చేస్తాం, కిరణ్ శంకర్ మంచి పాటలు అందించారు’ అని అన్నారు. నవదీప్ మాట్లాడుతూ, ట్రైలర్ బాగుందని, పాటలు కూడా బాగున్నాయని, తప్పకుండా సినిమా విజయం సాధించాలన్నారు.