చిన్నారులకోసం అల్లాణి క్లాస్‌రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ బాల బాలికలలో సినిమా పరిజ్ఞానం పెంపొందించడానికి ‘క్లాస్‌రూమ్’ సినిమా నినాదంతో సినిమా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయినుండే పిల్లలకు సినిమాపట్ల అవగాహన కలిగించడం కోసం ఈ ఫౌండేషన్‌ను తాను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమాజంలో పిల్లలకు అన్నీ దొరికినా, వారి జీవితాలను ప్రభావితం చేసే సినిమా లోటు పూడ్చడానికి క్లాస్‌రూమ్ సినిమా ఫౌండేషన్ కృషి చేస్తున్నదని, గతంలో ఫిలిం ఫెస్టివల్ జ్యూరీగా పనిచేసినపుడు ఈ ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. పిల్లలు తాము ఎదుగుతున్న సమయంలో హింసాత్మక సినిమాలు చూడడం ద్వారా హింసాయుతంగా తయారవుతున్నారని, నీతి పాఠాలు బోధించడంకంటే వారికి బయోపిక్స్ లఘు చిత్రాలు చూపించడం ద్వారా చక్కటి వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.