చిరు షూటింగ్ షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఇకపై శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షాట్‌ను చిరంజీవిపై చిత్రీకరించారని తెలిసింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘కత్తిలాంటోడు’ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా అనుష్క నటించే అవకాశాలున్నాయి.