రాజేంద్రుడితో మరిన్ని సినిమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుప్రీమ్‌ను నిర్మాతలు నమ్మారు. ఈ కథలో బడ్జెట్ ఎక్కువైనా సరే కథను, నన్ను నమ్మి సినిమా రూపొందించారు. ఇప్పుడు లభించిన విజయం వారికే చెందుతుంది’ అని దర్శకుడు అనీల్ రావిపూడి అన్నారు. సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రానికి సంబంధించిన 50 రోజుల వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, సినిమాలో ప్రతిఒక్కరూ ఈ సినిమా కోసం ప్రేమతో పనిచేశారని, రాజేంద్రప్రసాద్ లాంటి మంచి నటుడితో మరిన్ని చిత్రాలు తీయాలని వుందని అన్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ తరువాత మళ్లీ 50 రోజుల పండుగ ఈ చిత్రానికి జరుపుకోవడం ఆనందంగా వుందని, కెమెరామెన్ తనను ఎంతో అందంగా ఈ చిత్రంలో చూపారని, ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలని కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ అన్నారు. మార్కెట్ విధానం పూర్తిగా మారిపోయిన ఈ రోజుల్లో ఒక సినిమా ఇన్ని రోజులు ఆడుతుంది అని లెక్క కట్టలేకపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం అర్థశతదినోత్సవం జరుపుకోవడం ఆనందంగా వుందని రాజేంద్రప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో రాజు, రఘుబాము, శేషు, రాఘవ, శ్రీనివాసరెడ్డి, జె.పి. తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర బృందానికి షీల్డులను అందించారు.