మళ్లీ అదే జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో హీరోయిన్లుగా హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య-జ్యోతిక కలిసి మళ్లీ నటించనున్నారు. 2006లో వచ్చిన ఓ తమిళ చిత్రం తరువాత వారు మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ దాదాపు పదేళ్ల తరువాత ఈ జోడీ తెరపై కనువిందు చేయనుంది. గత సంవత్సరం 30 వయదినిలె చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా తన భర్త సూర్య రూపొందించనున్న చిత్రంలో నటించనుంది. జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మ అనే దర్శకుడు ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఇటీవలే సూర్య నటించిన ‘24’ చిత్రంలో జ్యోతిక నటించాల్సి వున్నా కొన్ని కారణాల చేత అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం సూర్య-జ్యోతికల జంట ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోనుంది.