అంధుడిగా రామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో కమర్షియల్ సినిమాలే వస్తాయి, ప్రయోగాలు చేయరు అనే అపవాదుని దూరంచేసే పనిలో పడ్డారు తెలుగు హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. లేటెస్ట్‌గా ఓ సినిమాలో అంధుడి పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు రామ్. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే ఈ సినిమాలో తాను అంధుడి పాత్ర పోషిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు అనిల్‌రావిపూడి. పటాస్, సుప్రీమ్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్న అనిల్ రావిపూడి రామ్‌తో ఈ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. అనిల్‌కూడా ట్విట్టర్‌లో ఈ సినిమా గురించి తెలుపుతూ నా తదుపరి చిత్రంలో హీరో బ్లైండ్ పాత్రలో కనిపిస్తాడు, ఈ సినిమా అన్నిరకాల కమర్షియల్ హంగులతో ఉంటుందని తెలిపాడు. మొత్తానికి వీరి ట్విట్‌లతో టాలీవుడ్‌లో సంచలనం నెలకొంది. ప్రస్తుతం రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ నటించే సినిమా ఇదే. త్వరలోనే ఈ ప్రయోగాత్మక సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారట.