నాగ్.. నమో వెంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ భక్తిరస చిత్రం నేటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వెంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హాథీరామ్‌బాబా జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, నేటినుంచి ముహూర్తం షాట్‌తో షూటింగ్ మొదలుకానుందని దర్శకుడు తెలియజేశారు. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో రూపొందిన భక్తిరస చిత్రాలు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’ చిత్రాలు మంచి ప్రజాదరణ పొందడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగార్జున గెటప్ కొత్తగా వుంటుందని, ఇందులో హీరోయిన్లుగా ప్రజ్ఞాజైస్వాల్, విమలారామన్, అనుష్కలు నటిస్తున్నట్టు తెలిసింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.