ఐఫా అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న 17వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం సంరంభం మొదలైంది. బాలీవుడ్‌కు చెందిన 150మంది ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు స్పెయిన్‌కు చెందిన సినీ,వ్యాపారరంగ ప్రముఖులూ తోడయ్యారు. గురువారం లాంఛనంగా మొదలైన ఐఫా వేడుకలో తొలిరోజంతా సదస్సులు, చర్చాగోష్టులు జరిగాయి. శుక్రవారం ఫిక్కి-స్పెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా పలు అంశాలపై చర్చించాయి. ఈ సందర్భంగా ఇరు సంస్థల మధ్య పలు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు ఫిల్మ్ అండ్ టీవి ప్రొడక్షన్స్ గిల్డ్, కాసా డి ల ఇండియాల మధ్యకూడా పలు ఒప్పందాలు కుదిరాయి. సినీవ్యాపార రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు ఉద్దేశించి వీటిమధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇక శిల్పాశెట్టి యోగా ప్రదర్శన శనివారం ఉదయం నిర్వహిస్తారు. ప్రియాంకచోప్రా, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా, సల్మాన్‌ఖాన్‌సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఐఫా వేదికపై తళుక్కున మెరిశారు. ఫిక్కి గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సును భారత దౌత్యవేత్త విక్రమ్ మిశ్రీ ప్రారంభించారు. ప్రఖ్యాత డిజైనర్ ప్రబుల్ గురుంగ్ రూపొందించిన ఎర్రని దుస్తుల్లో దీపికాపదుకొనే మెరిసిపోగా రోహిత్‌గాంధీ-రాహుల్‌ఖన్నా రూపొందించిన తెల్లటి వస్త్రాల్లో సోనాక్షిసిన్హా అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు శిల్పాశెట్టి శివన్-నరేష్ రూపొందించిన జంప్‌సూట్‌లో చూపురుల మనసు దోచుకుంది. 26న అవార్డుల ప్రదానం జరగనుంది.

chitram దీపికా పదుకొనె, శిల్పాశెట్టి