అల్లు అర్జున్‌తో హరీష్ శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దిల్‌రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్, దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ కూడా 4 సంవత్సరాల తరువాత కుదరటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు దిల్‌రాజు తెలిపారు. ‘ఆర్య, పరుగు చిత్రాల అనంతరం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యానర్‌లో 7 సంవత్సరాల తరువాత చేస్తోన్న చిత్రం ఇది. సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం విజయం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని దిల్‌రాజు అన్నారు.