1న రోజులు మారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రోజులు మారాయి’ రెండు జంటల ప్రేమ కథతో సాగుతుంది. సోషల్ మీడియావల్ల యువతలో ఎలాంటి మార్పు వచ్చిందనే అంశంతో ఈ సినిమా సాగుతుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ జూలై 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, ‘రోజులు మారా యి కథ గురించి మారు తి చెప్పినపుడు కలిసి చేద్దామని అనుకున్నామని, లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు తీసే పద్ధతి నచ్చడంతో ముందుకు వెళ్లామని తెలిపారు. నాలుగు పాత్రలమధ్య ఈ చిత్రం సాగుతుందని, ఇప్పటివరకు అబ్బాయిలపైనే ఇలాంటి కథనాలు వచ్చాయని, ఆ స్థానంలో అమ్మాయిలను తీసుకుని చివరిలో వారు తమ తప్పు ఎలా తెలుసుకున్నారనే కోణంలో చిత్రం సాగిందని అన్నారు. ఈ చిత్రాన్ని మొదటి 15 నిమిషాలు చూసి సరదాగా ఉందనుకున్నా, రెండో సగం ఎక్కువ నిడివి వుండడంతో 55 నిమిషాలు చేశామని ఆయన అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తానో లేదో తెలియదు కానీ, పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మంచి కథలు దొరికితే సినిమాలు తీయడమే తెలుసుని, ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేయాలనే సంకల్పంతో వున్నానని ఆయన వివరించారు. నానితో సినిమా ఆగస్టులో మొదలుపెట్టి డిసెంబర్‌లోనూ, శర్వానంద్‌తో శతమానం భవతి సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.