తిక్క పోస్టర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘దర్శకుడు సునీల్‌కు తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలన్న తిక్క ఉంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. రెండో హ్యాట్రిక్ ఈ సినిమాతో మొదలుకానుంది’ అని చెప్పారు. నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తిక్క ఉన్నట్లే లెక్క. వి.బి.రాజేంద్రప్రసాద్ లాంటి అద్భుతమైన నిర్మాత తరువాత నేను చూసిన మరో నిర్మాత రోహిన్‌కుమార్‌రెడ్డి. యువ దర్శకులంతా నాకోసం కొత్తగా పాత్రలు సృష్టించడం సంతోషం కలిగిస్తోంది. ఈ సినిమాలో ఎంత యాక్షన్ ఉంటుందోఅంత కామెడీ ఉంటుంది’ అన్నారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, ‘ చిత్ర దర్శకుడు, నిర్మాత నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాది టిపికల్ క్యారెక్టరైజేషన్.’అని తెలిపారు. దర్శకుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ, ‘సాయిధరమ్‌తేజ్‌తో సినిమా చేసే అవకాశం అనుకోకుండా వచ్చింది..
థమన్ ఫెంటాస్టిక్ ఆల్బమ్ ఇచ్చాడు’ అని చెప్పారు.
నిర్మాత రోహిన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ‘నేను మొదట సినిమా రంగంలోకి రావడం అవసరమా? అనుకున్నాను. కానీ తేజ్‌ను కలిసిన తరువాత సినిమా చేయాలనుకున్నాను. వారం, పదిరోజుల్లో టీజర్‌ను విడుదల చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.