మూడు కథల ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన తారాగణంగా సితార సినిమా పతాకంపై చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ, కథానాయకుడి పాత్ర మూడు వైవిధ్యమైన కోణాలలో, మూడు కథనాలతో సాగుతుందని, ఒకదానికొకటి పాత్రోచితంగా విభిన్నంగా సాగుతూ ఆసక్తిని కలిగిస్తాయని అన్నారు. మూడు ప్రేమకథల సమ్మిళితంగా నవ్యతతో సాగే ఈ చిత్రంలో కథానాయికలు కనువిందు చేస్తారని అన్నారు. మలయాళం నుండి తెలుగులో రూపొందించే సమయంలో తెలుగు వాతావరణానికి తగినట్లుగా పలు మార్పులు చేశామని ఆయన అన్నారు. నాగచైతన్య, శ్రుతిహాసన్ చందు మొండేటి కాంబినేన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రేమకథా సంగీత దృశ్యకావ్యంగా వుంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశి అన్నారు. జీవా, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్ కృష్ణ, సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, ఈశ్వరరావు, జోగినాయుడు, కృష్ణంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, రాజేష్ మురుగేశన్, కెమెరా:కార్తిక ఘట్టమనేని, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:చందు మొండేటి.