జక్కన్న మంచి డ్యాన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నటుడు సునీల్ మంచి డ్యాన్సర్. తన సినిమా ఆడియో వేడుకకు రమ్మంటే కాదనలేక షూటింగ్ పోస్ట్‌పోన్ చేసుకుని ఇక్కడికి వచ్చా. ఒక అభిమాని అభివృద్ధిలోకి వస్తున్నాడంటే మొదటిగా సంతోషించేది నేనే. సునీల్‌ను చూస్తుంటే చాలా ఆనందంగా వుంటుంది..’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుదర్శన్‌రెడ్డి రూపొందిస్తున్న ‘జక్కన్న’ ఆడియో విడుదల కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. బిగ్ సీడీని, ఆడియో సీడీని చిరంజీవి విడుదల చేసి తొలి కాపీని సునీల్‌కు అందించారు. ‘కామెడీలో హీరోయిజాన్ని చూపించడంలో సునీల్ విజయం సాధించాడని, ట్రైలర్‌లోనే ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలు పొందుపరిచి చక్కగా రూపొందించార’ని మెగాస్టార్ అన్నారు. ఈ సినిమాలో కామెడీ సహజంగా సాగుతుందని, మంచి కథతోపాటుగా పంచ్ డైలాగులు వుంటాయని, కుటుంబం అంతా కలిసి చూడవచ్చని హీరో సునీల్ అన్నారు. ఇకపై సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసి, నలభై సినిమాలు చేసినంతగా నవ్విస్తానని అన్నారు. తనకు సహాయం చేసినవారిని మరచిపోకుండా, వారిని ప్రేమిస్తూ సాయం చేసే అందమైన పాత్రతో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల అన్నారు. కార్యక్రమంలో నిర్మాత సుదర్శన్‌రెడ్డి, సంగీత దర్శకుడు దినేష్, మన్నారా చోప్రా, రాజ్‌తరుణ్, రాజా రవీంద్ర, సప్తగిరి, రాంప్రసాద్, తమన్, ఎన్.శంకర్, పాల్గొన్నారు.