నీ జతలేక... గీతాలాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పారుల్‌గులాటి జంటగా శ్రీ సత్య విదుర మూవీస్ పతాకంపై లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా రూపొందించిన చిత్రం నీ జతలేక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఎన్.శంకర్ ఆడియో విడుదల చేసి తొలి కాపీని సి.కళ్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ సరికొత్తగా ఉండడంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, సంగీత దర్శకుడు స్వరాజ్ అందించిన బాణీలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని, తాము కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమా తప్పక విజయవంతవౌతుందని చెప్పారు. నాగశౌర్య, ఫారుల్‌యాదవ్, సరయులకు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని, కరుణాకరన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, ఓ అందమైన కథకు సరికొత్త కథనాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలెట్‌గా ఉంటుందని, ప్రతి పాట అందరికీ నచ్చుతుందని దర్శకుడు లారెన్స్ దాసరి అన్నారు. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాగర్, హరినాథరావు, చమన్, సరయు, కె.పి.చౌదరి తదితరులు పాల్గొన్నారు. విస్సురెడ్డి, ఆర్.కె.బాబు, నామాలమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బుజ్జి కె, మాటలు: శేఖర్ విఖ్యాత్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: స్వరాజ్, పాటలు: రామ్‌పైడిశెట్టి గాంధీ, దర్శకత్వం: లారెన్స్ దాసరి.