శివగామి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం టాకీస్ పతాకంపై మనీష్ ఆర్య, ప్రియాంకరావ్ జంటగా సుమంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శివగామి. తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి ఆడియో సీడీని విడుదల చేసి సి.కళ్యాణ్, ఓం.సాయిప్రకాష్‌లకు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు, కన్నడ భాషల్లో 4 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇదని, ఇటీవల కాలంలో వచ్చిన హారర్ చిత్రాల్లో అగ్రగామిగా శివగామి నిలుస్తుందని తెలిపారు. త్వరలో ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథులు సినిమా ఆడియో, ట్రైలర్లు బాగున్నాయని అన్నారు. గుజరాత్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిందని, ఈ చిత్రానికి నేపథ్య సంగీతం కన్నడంలో ప్రముఖ సంగీత దర్శకుడైన గురుకిరణ్ అందించడం విశేషమని నిర్మాత రాజశేఖర్ అన్నారు. ఈ చిత్రంలో నటించిన బేబి సుహాసినికి కన్నడ రాష్ట్ర అవార్డు లభించిందని, సీనియర్ నటీమణి సుహాసినీ మణిరత్నం పోషించిన ఓ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, నిర్మాత మోహన్‌గౌడ్, భారతీబాబు, సంస్కృతి, శివ వై.ప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎస్.త్యాగరాజ్, సమర్పణ: రమేష్‌కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమంత్.

చిత్రం ప్రియాంక రావు