మరల తెలుపనా ప్రియా.. గీతావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చైత్ర చలనచిత్ర పతాకంపై ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మరల తెలుపనా ప్రియా. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. రమేష్‌ప్రసాద్ సినిమా బ్యానర్ లోగోను విడుదల చేయగా హీరో నిఖిల్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందిందని, శేఖర్‌చంద్ర, భాస్కరభట్ల ఈ సినిమా పాటలకోసం చాలా కష్టపడ్డారని, వారందరినీ ఇబ్బందిపెట్టి మరీ పనిచేయించుకున్నామని అన్నారు. ఓ అందమైన ప్రేమకథతో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం సరికొత్తగా ఉంటుందని, విలన్‌గా సుజోమ్యాథ్యూ నటన ఈ సినిమాలో హైలెట్‌గా ఉంటుందని వారు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, స్క్రీన్‌ప్లే పనితనానికి కెమెరా వర్క్స్‌కి ఈ చిత్రం హైలెట్‌గా సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, రాహుల్ రవీంద్రన్, అశ్విన్, పూజా రామచంద్రన్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. సమీర్, సన, రవివర్మ, పావనిరెడ్డి, సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.రాజశేఖర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాతలు: కె.సురేష్‌బాబు, శ్రీనివాస్ ఉడిగ, నిర్మాణం: శ్రీ చైత్ర చలనచిత్ర, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాణి ఎం.కొసరాజు.

చిత్రం వ్యోమనంది