అర్ధనారి వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ యజత్, వౌర్యాని ప్రధాన పాత్రల్లో పత్తికొండ సినిమాస్ పతాకంపై భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘అర్ధనారి’. దీని ట్రైలర్‌ను శనివారం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘్భనుశంకర్ గతంలో చాలా పాత్రలు చేసినా ప్రతిభకు తగిన సినిమా పడలేదు. ఈ సినిమాతో భానుకి మంచి లైఫ్ వస్తుందని భావిస్తున్నా’అని చెప్పారు. దర్శకుడు భానుశంకర్ మాట్లాడుతూ, ‘ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను చాలామంది హీరోలతో చేయడానికి ప్రయత్నించినా, అర్ధనారి పాత్రలో నటించడానికి ఎవరు ముందుకురాలేదు. 40కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా చేయాలనుకున్నాం. కానీ నిర్మాతలకు ఉన్న పరిధిలో చక్కగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సుమారు 85రోజుల పాటు నిజామాబాద్‌లో షూటింగ్ చేశాం. జూలై 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ, ‘చాలామంది హీరోలతో సినిమా చేయడానికి సంప్రదించినా కుదరలేదు. ఓ మంచి సినిమా చేశామని తృప్తి ఉంది. ప్రేక్షకులను ఆదరిస్తారనే నమ్మకముంది’అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కర్లపూడి కృష్ణ, వౌర్యాని పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సాయిశ్రీనివాస్ గాదిరాజు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: రవివర్మ, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ; మాటలు: నివాస్, నిర్వహణ నిర్మాత: కర్లపూడి కృష్ణ, సమర్పణ : భరత్‌రాజ్, నిర్మాత: రవికుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాను శంకర్‌చౌదరి.