ఐఫాలో బాజీరావ్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పెయిన్‌లో జరుగుతున్న 17వ ఐఫా చిత్రోత్సవంలో ఏకంగా 13 అవార్డులతో ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమచిత్రంగా ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఎంపిక కాగా బాజీరావ్ మస్తానీ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్‌లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఉత్తమ నటుడిగా ఇదేచిత్రంలో కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్ ఎంపిక కాగా ఉత్తమ నటిగా ‘పికు’ హీరోయిన్ దీపికాపదుకొనే అవార్డు కైవసం చేసుకుంది. కాగా విమెన్ ఆఫ్ ది ఇయర్, ఉత్తమ సహాయనటి అవార్డులను ప్రియాంక చోప్రా కైవసం చేసుకుంది. మాడ్రిడ్‌లో నాలుగురోజులుగా జరుగుతున్న ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) వేడుకలో చివరిరోజైన ఆదివారం అవార్డులు ప్రకటించారు. బాలీవుడ్‌లో నిర్మించే హిందీ చిత్రసీమలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణలకు ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో ఐఫా ఈ వేడుకలను నిర్వహిస్తూంటుంది. కాగా స్పెయిన్‌తో భారత్ దౌత్యసంబంధాలు ఏర్పడి అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సారి ఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో ఐఫా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కాగా బాలీవుడ్‌కు చెందిన 150మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అనిల్‌కపూర్, టైగర్‌ష్రాప్, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా, ప్రియాంకచోప్రావంటి హేమాహేమీలు ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా ప్రియాంక, సల్మాన్, హృత్రిక్, దీపికాపదుకునే స్వయంగా సంగీతనృత్య కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

వీరే విజేతలు
ఉత్తమ చిత్రం : బజరంగీ భాయ్‌జాన్
ఉత్తమ దర్శకుడు : సంజయ్‌లీలా బన్సాలి
(బాజీరావ్ మస్తాని)
ఉత్తమ నటుడు : రణవీర్‌సింగ్
(బాజీరావ్ మస్తాని)
ఉత్తమ నటి : దీపిక పదుకొనె (పికు)
ఉత్తమ సహాయ నటుడు : అనిల్‌కపూర్ (దిల్ దడ్‌కనే దొ)
ఉత్తమ సహాయ నటి : ప్రియాంకచోప్రా
ఉత్తమ ప్రతినాయకుడు : దర్శన్‌కుమార్ (ఎన్‌హెచ్10)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : కబీర్‌ఖాన్-పర్వీజ్‌షేక్,
వి.విజయేంద్రప్రసాద్
ఉత్తమ గేయరచయిత : వరుణ్‌గ్రోవర్
బెస్ట్‌కొరియోగ్రఫి : రెమె డిసౌజ సింగ్
బెస్ట్ సాంగ్ ఇంజనీర్ : తనమ్ గజ్జర్ (బాజీరావ్..)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : సంచిత్ బలహార్ (బాజీరావ్...)
స్పెషల్ ఎఫెక్ట్ : ప్రసాద్ సుతారా (బాజీరావ్..)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : అంజుమోది (బాజీరావ్)
బెస్ట్ మేకప్ : విక్రమ్ గైక్వాడ్
బెస్ట్ డిజైన్ : శ్యామ్‌కేశవ్ (బాజీరావ్...)
ఉత్తమ కథ : జుహి చతుర్వేది (పికు)
ఉత్తమ గాయని : మొనాలీ ఠాకూర్
ఉత్తమ గాయకుడు : పపాన్
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ : ప్రియాంక చోప్రా
ఉత్తమ సినిమాటోగ్రఫి : సుదీప్ ఛటర్జి
ఉత్తమ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

చిత్రంలు
రెండు అవార్డులతో ప్రియాంక, రణవీర్ -దీపిక
అవార్డుల ప్రదానోత్సవంలో ప్రియాంక షో