విజయ్ ఆంటోని సైతాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిచ్చగాడు చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘సైతాన్’. ఎన్‌ఎన్‌ఎన్ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను ఎస్.వేణుగోపాల్ చేజిక్కించుకున్నారు. ప్రదీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ, సైతాన్ షూటింగ్ పూర్తయిందని, జూలైలో ఆడియో విడుదల చేసి ఆగస్టులో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించానని కథానాయకుడు విజయ్ ఆంటోని అన్నారు. బిచ్చగాడు హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు అధికంగా ఉన్నాయన్నారు. అరుంధతి నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం:విజయ్ ఆంటోని, కెమెరా:ప్రదీప్ కలిపురయత్, ఎడిటింగ్:వీర సెంథిల్, నిర్మాత:ఎస్.వేణుగోపాల్, దర్శకత్వం:ప్రదీకుమార్.