అందులో నిజం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్‌కు ఈమధ్య చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో కాస్త నిరాశలో ఉన్నట్టుంది. పవన్‌కళ్యాణ్‌తో చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్, మహేష్‌బాబుతో నటించిన బ్రహ్మోత్సవం పల్టీ కొట్టాయి. హిందీలో ఎన్నో ఆశలు పెట్టుకున్న దో లఫ్జోంకీ కహాని సినిమా కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక కాజల్ కెరీర్ ముగిసిపోయిందని ఆమె సినిమాలకు దూరమై పెళ్లిచేసుకునే అవకాశాలు ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై కాజల్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ, తన సినిమాలు పరాజయం పాలైనా తన క్రేజ్ మాత్రం తగ్గలేదని, సినిమాలు ప్లాపైనా ఆ పాత్రలతో తనకు పేరొచ్చిందని, అవకాశాలు కూడా తగ్గలేదని చెబుతోంది. సినిమాలు మానేస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ప్రస్తుతం ఈమె తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది.