బ్యాంకాక్‌లో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్, మమతా కులకర్ణి, ఆరోహి, ఐశ్వర్య ముఖ్యపాత్రల్లో కాటా ప్రసాద్ దర్శకత్వంలో ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై నందం రామారావు నిర్మిస్తున్న బ్యాంకాక్‌లో ఏం జరిగింది? చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా, టిఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి మురళీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 45 రోజులపాటు బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తాం అన్నారు. నిర్మాత రామారావు మాట్లాడుతూ, ‘కథ నచ్చి మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను. మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. హీరో నవీన్ మాట్లాడుతూ, ‘ఇది నా మొదటి చిత్రం. తప్పకుండా నన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వేణు గజ్వేల్, ఫొటోగ్రఫీ: సంతోష్ కె, నిర్మాత: నందం రామారావు, దర్శకత్వం: కాటా ప్రసాద్.