రోడ్డు జర్నీ నేపథ్యంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శశి, చేతన్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ సత్య దర్శకత్వంలో శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగసుశీల క్లాప్‌నివ్వగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు నవీన్ సత్య మాట్లాడుతూ, ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథ. రోడ్డు జర్నీ నేపథ్యంగా సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కే ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులు నటిస్తున్నారు అన్నారు. నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ, ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కే సినిమా ఇదన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. ఈనెల చివరివారం నుండి షూటింగ్ జరుగుతుంది అన్నారు.