అందుకే ధైర్యం చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, నిహారిక జంటగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీ్ధర్ నిర్మించిన ‘ఒక మనసు’ ప్రస్తుతం టాక్‌తో రన్‌అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీ్ధర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘ఈ సినిమా కొందరికి బాగా నచ్చింది. హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ అని చెబుతున్నారు. కొందరు మాత్రం స్లోగా వుందని అంటున్నారు. అందుకని 14 నిమిషాల నిడివి తగ్గించాం. ఇప్పుడు సినిమా చూసినవారంతా బావుందంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా పరిచయమైన నిహారికను అందంగా చూపించాలని అనుకున్నాం. దానికితగ్గట్టే రామరాజు అద్భుతమైన కథను అందించారు. ఇలాంటి యాంటీక్లైమాక్స్‌తో సినిమా చేయడానికి ఏ నిర్మాతా సాహసం చేయడు. ఇలా చూపించే తమిళ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం మనమెందుకు చేయకూడదని చేసిన సినిమా ఇది. ఇక ఈ చిత్రంలో కుల రాజకీయాలను ఎత్తిచూపారని అంటున్నారు. మనకు స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచి మన దగ్గరవున్న రాజకీయాలు అవే కదా. వాటినే చూపించాం. నాగశౌర్య, నిహారిక చక్కటి నటనను కనబరిచారు. అటు ఓవర్సీస్‌లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఉత్సాహంతో మళ్లీ రామరాజుతోనే మరో చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మిస్తున్నాను.’అన్నారు.