హృతిక్‌తో రొమాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫెయిర్ అండ్ లవ్‌లీ కమర్షియల్ యాడ్‌తో బాగా పాపులర్ అయిన యామీ గౌతమ్ ఆ తర్వాత దక్షిణాదిలో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఆమె చేసిన రెండు సినిమాలు ప్లాప్ అవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ చేసిన సినిమాలకంటే కూడా ప్రేమాయణాలు సాగించి, సంచలనం సృష్టించిన ఈ భామకు ఇప్పుడు ఓ క్రేజీ అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు హృతిక్‌రోషన్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. యామీ కెరీర్‌లో ఇదే భారీ సినిమా. కాబిల్ పేరుతో తెరకెక్కే ఈ సినిమా రివెంజ్ డ్రామాతో తెరకెక్కుతుందట. ఇందులో యామీ కనిపించేది కొద్దిసేపే అయినా హృతిక్‌తో ఘాటు రొమాన్స్, స్కిన్‌షోకి మాత్రం కొదువలేదట. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి యామీ గ్లామర్‌ను పెంచేందుకు సిద్ధమైందట. మొత్తానికి ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటుకోడానికి సిద్ధమైందట.

చిత్రం యామీగౌతమ్‌