బాధ్యతగల సినిమా అర్ధనారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు అనే కానె్సప్ట్‌తో దర్శకుడు భానుశంకర్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్ధనారి’. నూతన నటీనటులతో పత్తికొండ సినిమాస్
పతాకంపై రవికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 1న విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు భానుశంకర్ చౌదరితో ఇంటర్వ్యూ..

కొత్త జోనర్‌లో
ఈమధ్య కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్, కమెడియన్స్ ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని అంటున్నారు. కానీ సినిమాలో విషయం వుంటే చాలు అని చాలా సినిమాలు రుజువు చేశాయి. అలాగే ఓ కొత్త జోనర్‌లో తెరకెక్కించిన సినిమా ఇది. సమాజానికి సంబంధించిన అంశాలతో రూపొందించాం.
ఇది ట్రాన్స్‌జండర్ సినిమా కాదు
ఈ సినిమాలో హీరో హిజ్రా పాత్రలో కనిపిస్తాడు. అలాగని ఇది ట్రాన్స్‌జండర్ సినిమా కాదు. హీరో ఆ గెటప్‌లో కనిపిస్తాడు అంతే. నిజానికి ఈ కథను చాలామంది హీరోలకు చెప్పాను. ఎవరూ ఇలాంటి ప్రయోగాలు చేయడానికి రెడీగా లేరని అర్ధమైంది. దాంతో కొత్త వారితో ఈ ప్రయోగాన్ని చేశాను. ఇందులో హీరో పాత్రలో అర్జున్ ఎజిత్ అనే అచ్చతెలుగు అబ్బాయి హీరోగా నటించాడు. నిజంగా తెలుగు పరిశ్రమకు అతను మరో కమల్‌హాసన్, రజనీకాంత్ అని చెప్పొచ్చు.
వాళ్లను తక్కువ చేయలేదు
ఈ సినిమాలో హీరో అర్ధనారి గెటప్‌లో తన లక్ష్యాన్ని సాధిస్తాడు కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. ప్రతి ఒక్కరికి లక్ష్యాలుంటాయి. అందులో హిజ్రాలకు కూడా ఉంటాయి. కొంతమంది హిజ్రాలు చేసే పనులవల్ల చాలా మంది మంచి వారికి చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా హిజ్రాల్లోని మంచిని చూపించే ప్రయత్నమే చేశాం. ఎక్కడా తక్కువ చేయలేదు.
అందరికీ నచ్చేలా
సమాజంకోసం తీసిన సినిమా ఇది. బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కులేదు అనే కానె్సప్ట్‌తో రూపొందించిన ఈ సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ఇంత బాగా చేయడానికి నా నిర్మాతలు ఎంతో సపోర్ట్ అందించారు.
తదుపరి చిత్రాలు
కథలైతే సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. -

శ్రీ