హంతకుడు ఆడియో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండురంగ క్రియేషన్స్ పతాకంపై పవన్‌కుమార్ కథానాయకుడుగా రాజ్ బి.కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం హంతకుడు (హీ ఈజ్ నాట్ ఎ కిల్లర్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని విడుదల చేసి, తొలి కాపీని మల్కాపురం శివకుమార్‌కు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా కళాకారులు ఇప్పుడిప్పుడే తమ ప్రతిభను చాటుకునేందుకు అడుగులు వేస్తున్నారని, వారంతా విజయం సాధిస్తారని, మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఓ యువకుడు ఉక్కుపాదాన్ని ఎలా పెట్టాడు అన్న అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రేక్షకులకు ఓ సందేశాత్మక చిత్రంగా ఉంటుందని హీరో పవన్‌కుమార్ అన్నారు.