సైమా సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకోసం సింగపూర్ సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దక్షిణ భారత సినీరంగానికి చెందిన ప్రముఖులు తరలివెళ్లారు. అవార్డుల వేడుక వైభవంగా సింగపూర్‌లో జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దక్షిణాది తారలు భారీగా వెళ్తున్నారు. మరోవైపు ఈ వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్‌లో పలువురు ప్రముఖ నటీమణులు పాల్గొంటున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలు 2016కు గాను సింగపూర్‌లో నిర్వహిస్తున్నారు. సింగపూర్‌లోని సన్‌టెక్ కనె్వన్షన్ సెంటర్‌లో గురు, శుక్రవారాలు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఖుష్బూ, హన్సిక, ప్రణీత, కమెడియన్ అలీ సహా పలువురు తారలు ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినీరంగాలకు చెందిన ప్రతిభావంతులకు ఈ వేడుకలో అవార్డులను అందజేస్తారు. 2012 నుంచి సైమా వేడుకలు ప్రారంభమయ్యాయ.

చిత్రం...సైమా వేడుకల్లో పాల్గొనేందుకు సింగపూర్ చేరుకున్న సినీనటి వేదిక, దేవిశ్రీ ప్రసాద్, ఖుష్బు