మహేష్.. వాస్కోడిగామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ తర్వాత మహేష్‌బాబు తన తదుపరి చిత్రానికి జోరుగా సన్నాహాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చేనెల 15న సెట్స్‌పైకి రానుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ న్యాయ వ్యవస్థపై పోరాటంగా ఉంటుందని తెలిసింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘ఎనిమీ’, ‘చట్టంతో పోరాటం’ వంటి టైటిల్స్ వినిపించాయి. స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి ‘వాస్కోడిగామా’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టైటిల్ గురించి మహేష్‌తో దర్శకుడు మురుగదాస్ చర్చించినట్టు తెలిసింది. విభిన్నమైన టైటిల్స్‌తో సినిమాలు తీసే మురుగదాస్ ఈ చిత్రానికి కూడా అలాంటి కొత్త టైటిల్‌నే ఎంచుకునేలా ఉన్నాడు. ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందట. మరోవైపు ఈ సినిమా తమిళ్ వెర్షన్‌కు మహేష్ డబ్బింగ్ చెబుతాడని తెలిసింది. ఏకధాటిగా షూటింగ్ జరిపి, త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. మరి ఈ సినిమాపై అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.