భలే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘ముకుంద’, ‘ఒక లైలాకోసం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పూజాహెగ్డే. ఆ సినిమాల తర్వాత దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో బాలీవుడ్‌లో వచ్చిన క్రేజీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రముఖ నటుడు హృతిక్‌రోషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ‘మొహెంజోదారో’ చిత్రంలో నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తున్న పూజాహెగ్డేకు ప్రస్తుతం మంచి క్రేజ్ దక్కింది. వచ్చేనెలతో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. ఈలోగా ఈమెకు మరో మెగా చాన్స్ దక్కింది. అల్లు అర్జున్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డే ఓకే అయ్యిందట. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చేనెలలో సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా టాలీవుట్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారతాననే నమ్మకంతో వుంది పూజ!