లక్కీచాన్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయవౌతూ తెరకెక్కిన ‘రేయ్’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది పంజాబీ భామ సయామీఖేర్. మొదటి చిత్రంతోనే గ్లామర్ ప్రదర్శనలో సంచలనం క్రియేట్ చేసిన ఈమెకు ఆ సినిమా కమర్షియల్‌గా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. దాంతో దక్షిణాదిలో అవకాశాలు రాలేదు. ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇన్ని రోజులు అవకాశాలకోసం ఎదురుచూసిన ఈమెకు తాజాగా లక్కీచాన్స్ దక్కింది. ప్రముఖ సీనియర్ నటుడు అనిల్‌కపూర్ తనయుడు హర్షవర్ధన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కే సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ దక్కింది. రాకేష్ ఓంప్రకాష్‌మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ చిత్రంలో సయామీ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐదు బికినీ సన్నివేశాలు ఉంటాయట. దాంతోపాటు రొమాన్స్, లిప్‌లాక్‌లు, స్కిన్‌షోలకు కొదవే లేదు. మొత్తానికి ఈ సినిమాతో తన టాలెంట్‌ను మొత్తం ప్రదర్శించి, బాలీవుడ్‌లో దుమ్మురేపడానికి రెడీ అయ్యింది.

చిత్రం సయామీఖేర్