నరేష్ ఇంట్లో దయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత తెలియజేశారు. జూన్ 23నుండి శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నామని, దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే కచ్చితంగా విజయవంతవౌతుందన్న నమ్మకం కుదరడంతో ప్రారంభించామని తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం హారర్ టచ్‌తో అందర్నీ అలరిస్తుందని అన్నారు. అల్లరి నరేష్ గత చిత్రాలకన్నా భిన్నంగా ఆయన కెరీర్‌లో ఓ విభిన్నమైన చిత్రంగా ఈ సినిమా రూపొందుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నరేష్‌తో ‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’ వంటి హిట్ చిత్రాలను తాను రూపొందించానని, ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని, గతంలో నరేష్ చేయని ఓ విభిన్నమైన పాత్ర ఇందులో చేస్తున్నారని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. కృతిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.