16న చుట్టాలబ్బాయి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది కథానాయకుడుగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘చుట్టాలబ్బాయి’ టీజర్‌ను యూ ట్యూబ్‌లో విడుదల చేశామని, 24 గంటల్లోనే 1.5 లక్షల వ్యూస్ సాధించిందని అన్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్ లభిస్తున్న ఈ చిత్రాన్ని లావిష్‌గా చిత్రీకరించామని, కొత్త లుక్‌తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో హీరో అందర్నీ ఆకట్టుకున్నాడని, పృథ్వి, పోసాని డైలాగులు ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయని, డ్రాగన్ ప్రకాష్ కంపోజ్ చేసిన ఫైట్ హైలెట్‌గా ఉందని తెలిపారు. ప్రస్తుతానికి థమన్ నేపథ్య సంగీతం కార్యక్రమాలను జరుపుతున్నారని, ఈనెల 16న ఆడియోను వైభవంగా విడుదల చేస్తున్నామని, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు.