28 ఏళ్ల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 28 సంవత్సరాల తరువాత మళ్లీ సాయిబాబా పాత్రలో నటిస్తున్నానని, ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందని సినీనటుడు విజయ్‌చందర్ అన్నారు. విజయ్‌చందర్ సాయిబాబాగా నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాస్ జి.ఎల్.బి. దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం అవధూతగా నటిస్తున్న సాయిప్రకాష్ మాట్లాడుతూ, సాయి భక్తుల అనుభవాలకు తెరరూపం ఇస్తూ రూపొందిన ఈ చిత్రంలో తనకు మంచి పాత్ర లభించిందని, తెలుగు వారికి బాబా అంటే విజయ్‌చందరే గుర్తుకు వస్తారని, ఆయనతో కలిసి నటించడం ఆనందంగా వుందని తెలిపారు. బాబా భక్తుల ఇతివృత్తాలతో పూర్తిస్థాయి సినిమా రావడం ఈ చిత్రంతోనే మొదలైందని, షూటింగ్ మొత్తం పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని దర్శకుడు శ్రీనివాస్ అన్నారు. ఈనెల ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. కోట శ్రీనివాసరావు, నూతన్‌ప్రసాద్, రావు రమేష్, ఎల్బీశ్రీరామ్, సుమన్, రాజ్యలక్ష్మి, సుదీప, అశోక్‌కుమార్, సుదర్శన్, పురుషోత్తమరావు, వాసన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం, కెమెరా: సురేంద్రరెడ్డి, నిర్మాత: భవానీ అర్జున్‌రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి.