సెప్టెంబర్ నుండి నరేష్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘సెల్ఫీ రాజా’ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తికానుంది. ఈ సినిమా తర్వాత నరేష్ నటించే తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నాడు. ‘అలా ఎలా’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనీష్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కృష్ణ్భగవాన్ కథ, మాటలు అందిస్తున్నాడని తెలిసింది. గతంలో నరేష్‌తో ‘కెవ్వుకేక’ చిత్రాన్ని నిర్మించిన తరువాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందని, నరేష్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే వైవిధ్యమైన కథ ఇదని, సెప్టెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపాడు.