హరీష్‌శంకర్‌తో బన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘సరైనోడు’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తారాస్థాయికి చేరిపోయింది. ఈ స్టేటస్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు హరీష్ శంకర్‌తో అల్లు అర్జున్ తన కొత్త సినిమా చేయనున్నట్లు తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్‌సింగ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లాంటి తన గత చిత్రాల తరహాలోనే హరీష్ శంకర్ ఈ సినిమాను ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారట. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ అదిరిపోయేలా ఉందని టీమ్‌వర్గాల నుంచి సమాచారం. అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.