రెండో షెడ్యూల్లో ఉందా.. లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్స్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఉందా..లేదా?. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేసి, రెండో షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయని, రంజాన్ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కీలక సన్నివేశాలన్నీ ఇప్పటికే చిత్రీకరించామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పాటలన్నీ హైలెట్‌గా ఉంటాయని, ఉందా లేదా? అనే పేరు జస్ట్ఫికేషన్ ఏంటి? అని అడిగితే సినిమా చూస్తేనే తెలుస్తుందనీ, ఒక సరికొత్త అంశాన్ని ఈ చిత్రంలో చర్చిస్తున్నామని తెలిపారు. అనుకున్న దానికన్నా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, సినిమా కూడా అంతే విధంగా రూపొందనుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, సంగీతం: శ్రీమురళి, నిర్మాత: అయితం ఎస్.కమల్, కథ, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్.