ఈనెలలో రానున్న అమెజాన్ యోధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాకీచాన్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ది లెజెండరీ అమెజాన్స్. ఈ చిత్రంలో రీచాజన్, సెసిలియా చియాంగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో ఇండో ఓవర్సీస్ పతాకంపై రూపొందించారు. హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో సాయిశ్రీజ విఘ్నేష్ ఫిలిమ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘అమెజాన్ యోధులు’ (మాహిష్మతి రాజ్యం) అన్న పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. హాలీవుడ్‌లో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉత్తమమైన సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశామని, సినిమా క్లైమాక్స్ బాహుబలి తరహాలోనే అద్భుతంగా సాగుతుందని తెలిపారు. భారీ సెట్టింగులతో విజువల్స్ గ్రాండియర్‌గా ఉంటాయని, ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు చూసిన వారందరూ మెచ్చుకున్నారని తెలిపారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: జి.వంశీకృష్ణవర్మ, సమర్పణ: జాకీచాన్, దర్శకత్వం: ఫ్రాంకీ చాన్.