1న చిత్రం భళారే విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాందిని ప్రధాన పాత్రలో భానుప్రకాష్ బలుసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. మనోజ్ నందం, అనీల్ కల్యాణ్ ఇతర పాత్రధారులు. ఉమాకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు భానుప్రకాష్ వివరాలు తెలియజేస్తూ సినిమా నేపథ్యంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఇది. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చేలా వుంటుంది. చాందినీ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవలే విడుదలై ట్రైలర్స్‌కు మంచి స్పందన లభించింది అన్నారు. నిర్మాత ఉమాకాంత్ మాట్లాడుతూ, ప్రయోగంతో ప్రతిభావంతమైన దర్శకుడిగా భానుప్రకాష్ గుర్తింపు తెచ్చుకున్నాడని, ఇది కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథ అని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నామన్నారు.