కాశీవిశ్వనాథ్‌గా విజయ్‌కాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌కాంత్ కథానాయకుడుగా తమిళంలో రూపొందిన ‘పెరరసు’ చిత్రాన్ని తెలుగులో కాశీవిశ్వనాథ్‌గా అనువదించారు. సెవెంత్ ఛానల్ సమర్పణలో నిర్మాత బాలాజీ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఉదయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర విశేషాలను బాలాజీ తెలుపుతూ గతంలో కెప్టెన్ విజయ్‌కాంత్ కథానాయకుడుగా తెలుగులో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్, సింధూరపువ్వు, పోలీస్ అధికారి చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయని, విజయ్‌కాంత్‌కు తెలుగులో కూడా ఫాన్ ఫాలోయింగ్ ఆ చిత్రాలతో లభించిందని, ఇప్పుడు కూడా అదే తరహా మ్యాజిక్‌తో విజయ్‌కాంత్ విశ్వనాథ్ చిత్రంతో వస్తున్నాడని తెలిపారు. ఎంతోమంది తెలుగు హీరోలు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నించారని, కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే ఆ ఫ్లేవర్ రాదు అని డబ్బింగ్ చేశామని, అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని తెలిపారు. ప్రకాష్‌రాజ్, నాజర్, సంపత్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, నిర్మాత: బాలాజీ, దర్శకత్వం: ఉదయన్.